కులకచర్ల, డిసెంబర్ 11: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని తిర్మలాపూర్ గ్రామం అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వం కేటాయించిన ప్ర త్యేక నిధులను సర్పంచ్, పాలకవర్గ సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నారు. కాలనీలు, వీధుల్లో మౌలిక వసతుల ను కల్పిస్తూ మండలంలోని ఇతర గ్రామాలకు తిర్మలాపూర్ను ఆదర్శంగా నిలుపుతున్నారు. గతంలో సమస్యలు ఎక్కడికక్కడే ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కరమవుతున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న తిర్మలాపూర్ గ్రామ పంచాయతీలో 750 మంది జనాభా ఉండగా, 560పైగా ఓట ర్లు ఉన్నారు. గతంలో ఈ పంచాయతీ పరిధి లో బండమీదితండా, లాల్సింగ్తండాలు ఉండేవి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పాలన సౌల భ్యం కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో ఆ రెండు తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. తిర్మలాపూర్ సర్పంచ్ వెంకటమ్మ, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రామంలో రూ. 35 లక్షలతో పల్లెప్రకృతివనం, డంపింగ్ యా ర్డు, వైకుంఠధామం, నర్సరీ, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేకాకుండా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథ ట్యాంకు నుంచి తాగునీటిని అందిస్తున్నారు.
వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్మాణం
గ్రామంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ ఇంటింటి నుంచి సేకరించిన చెత్తాచెదారాన్ని పంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యా ర్డుకు తరలిస్తున్నారు. మురుగునీటి కాల్వలు, గ్రామ శుభ్రతకు పారిశుధ్య సిబ్బంది కృషి చేస్తున్నారు. అంతేకాకుండా స్థానికులు ఇంటింటికీ ఇంకుడు గుంతలను, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు.
పల్లెప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు
తిర్మలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం లో అల్లనేరేడు, పూలు, నీలగిరి మొక్కలు, కొబ్బరి మొక్క లు, దానిమ్మ, మందారం వంటి వివిధ రకాల మొక్కలను నాటి స్థానికులు సంరక్షిస్తున్నారు. గ్రామానికి వెళ్లే దారిలో, చౌడాపూర్ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది. గ్రామంలోని నర్స రీలోనూ వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే..
గ్రామస్తులు, పెద్దల సహకారంతోనే గ్రామాన్ని అన్ని విధాలా అభివృ ద్ధి చేస్తున్నా. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నా. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తు న్నాం. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ ఇండ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
-వెంకటమ్మ సర్పంచ్, తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ
గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు
తిర్మలాపూర్ గ్రామాన్ని స్థానికుల సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం కేటాయించిన నిధులతో పలు అభివృద్ధి పనులతోపాటు మౌలిక వసతులను కల్పించడం జరిగింది. గ్రామాభివృద్ధికి స్థానికులు, పాలకవర్గ సభ్యులు సహకరిస్తున్నారు. గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం పనులను పూర్తి చేశాం.