ఈ రోజుల్లో సినిమా నిర్మాణం అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం.ఎంత చిన్న సినిమా నిర్మించాలన్నా.. మినిమమ్ మూడు కోట్ల బడ్జెట్ అవుతుంది. ఇక పెద్ద సినిమాల నిర్మాణం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందునా స్టార్ హీరోలు నటిస్తున్నారంటే నిర్మాతకు అది పెనుభారమే.. అయితే పూర్వపు రోజుల్లో సినిమా నిర్మాణం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో..సమయం, డబ్బు రెండూ వృదా కాకుండా చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
సినిమా నిర్మాణం నిర్మాత చేతులు దాటిపోతుది. అనవసరపు ఖర్చు పెరిగిపోతుంది. దీనిని ఎలా నివారించాలో అని పలుసార్లు నిర్మాతలు మీటింగ్ పెట్టుకున్నా పెద్దగా ఒరిగిందేమి లేదు.నిర్మాత సినిమాకు క్యాషియర్‌గా మారిపోయాడు.
అయితే ఈ రోజుల్లో సినిమా నిర్మాణం గురించి సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ముఖ్యంగా సినిమా షూటింగ్‌ల్లో వాడే క్యార్వాన్లపై ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఓ సినిమా చిత్రీకరణ ఎక్కడైనా జరుగుతుదంటే అక్కడ ఓ మినీ బస్టాండ్‌ను తలపిస్తుంది. స్టార్ హీరోకి, స్టార్ హీరోయిన్‌కి ఒక్కొక్కరికి రెండు క్యార్వాన్లు పెట్టుకుంటున్నారు. అలా ఒకరికి రెండు క్యార్వాన్లు ఎందుకో నాకు అర్థం కాదు.
ఇక ఆ క్యార్వాన్ నుండి షూటింగ్ జరుగుతున్న స్టూడియోలో.. అదే స్టూడియోలోని ఫ్లోర్‌లోకి హీరో వెళ్లడానికి పది మంది సెక్యూరిటి బౌన్సర్లు కావాలి. ఏంటీ స్టూడియోలోకి కూడా వచ్చి హీరోని కిడ్నాప్ చేస్తారా? ఎందుకు ఇలాంటి పరిణామాలు.. అనవసరపు ఖర్చు నిర్మాతపై’ అంటూ చెప్పుకొచ్చారు కాట్రగడ్డ ప్రసాద్.
అసలు షూటింగ్ ఏ బడ్జెట్లో చేస్తున్నాం.. ఎంతలో సినిమా తీస్తున్నా అనే అవగాహన లేకుండానే కొంత మంది నిర్మాతలు షూటింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ సినీయర్ నిర్మాత. ఆయన ఇంతకుముందు ఏఎన్నార్‌తో కాలేజీ బుల్లోడు, బందిపోటు, మా ఇంటి ఆడపడుచు వంటి చిత్రాలు నిర్మించారు.