దిల్‌రాజు ఒకప్పుడు వరుస చిత్రాల విజయాలతో నిర్మాతగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు ఆయన. దిల్, ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, బలగం వంటి తన బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఇప్పుడు దిల్ రాజు జోరు తగ్గింది. సినిమాల నిర్మాణం కూడా తగ్గించాడు.
ప్రస్తుతం నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, ఆడియన్స్ ఓటీటీకి అలవాటుపడటంతో.. ఒక వైపు సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా రాజు ఇంతకు ముందుతో పోలిస్తే సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం ఆయన నితిన్‌తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రంతో పాటు రామ్‌చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
దీనితో పాటు సుహాస్‌తో జనక అయితే గనక అనే సినిమాతో పాటు ఆకాశం దాటి వస్తావా అనే రెండు చిన్న సినిమాలు కూడా ఆయన బ్యానర్లో నిర్మాణంలో వున్నాయి. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న పరిస్థితుల దృష్ట్యా సినిమా నిర్మాణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు దిల్‌రాజు. అయితే ఇటీవల ఆయన రేవు అనే చిన్నసినిమా ట్రయిలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మొదట్నుంచీ కూడా సినిమా రివ్యూలపై కామెంట్స్ చేసే దిల్‌రాజు.. ఈ ఫంక్షన్లో పలు కామెంట్స్ చేశాడు.
రేవు సినిమా నిర్మాణంలో ఇన్వాల్వ్ అయ్యి, ప్రొడక్షన్ చూసుకుంటున్న ఇద్దరూ జర్నలిస్టులు.. మా సినిమాలు విడుదల అయినప్పుడు రేటింగ్స్ ఇస్తూ రివ్యూ రాసేవాళ్లు.. ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. నేను ఇప్పుడూ వీళ్ల రేవు సినిమా చూసి రివ్యూ చెబుతాను అని వ్యాఖ్యానించాడు.
సినిమా నిర్మాణం,దర్శకత్వం అంటే అంత ఈజీగా కాదు. ఎవరైనా ఇందులోకి దిగితే తెలుస్తుంది… మీరు సినిమాలు చూసి రేటింగ్‌లు ఇచ్చే తేల్చేశారు కదా.. మీ జడ్జిమెంట్ ఎలా వుందో… మీ సినిమా చూసి నేను చెబుతాను అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఈ కామెంట్స్ చేశాడు దిల్‌రాజు.. అయితే సినిమా యూనిట్ మాత్రం దిల్‌రాజు తమ సినిమా చూసిన రివ్యూ చెబుతానని అనడం పాజిటివ్‌గానే తీసుకుంది..