కరోనా వలన పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. గత ఏడాది తొమ్మిది నెలలు థియేటర్స్ మూతపడడంతో నాని, సూర్య లాంటి స్టార్స్ కూడా తమ సినిమాలను చేసేదేం లేక ఓటీటీలో విడుదల చేశారు. ఇక ఇప్ప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టనున్నాయని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 9న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న వకీల్ సాబ్ చిత్రం వచ్చే వారం ఓటీటీలో రిలీజ్ అవుతుందని కొన్ని పుకార్లు బయటకు రాగా, దానిపై దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
తెలుగు సినిమా, పెద్ద హీరో సినిమా ఏదైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తుంది. వకీల్ సాబ్ కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల అవుతుంది. వకీల్ సాబ్ చిత్రంపై ఇంత ప్రేమ చూపించి భారీ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికి ధన్యవాదాలు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను థియేటర్లోనే చూడండి. పెద్ద తెరపై చూసిన ఆనందం ఫోన్స్, టీవీలలో చూస్తే రాదు. వకీల్ సాబ్ సినిమాను ఇన్సిపిరేషన్‌గా తీసుకొని ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని దిల్ రాజు ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు
Producer DIL RAJU and Director SRIRAM VENU, clarification about VAKEEL SAAB OTT Rumours. #VakeelSaab #VakeelSaabJusticeServed pic.twitter.com/UO2D9Dbn7m
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2021