ఒట్టావా: బ్రెయిన్ క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులకు వినూత్న చికిత్స విధానాన్ని కెనడాలోని సన్నీబ్రూక్ హెల్త్ సైన్సెస్ సెంటర్ పరిశోధకులు తీసుకొచ్చారు. బ్యాక్టీరియా, వైరస్లు మెదడుపై ప్రభావం చూపకుండా ఉండేందుకు బ్లడ్-బ్రెయిన్ బారియర్‌గా పిలిచే ఓ పొర రక్షణగా ఉంటుంది. మెదడు రక్తనాళాలను, ఇతర కణాలను ఈ పొర వేరుచేస్తూ ఉంటుంది. అయితే, మెదడులో కణతి, బ్రెయిన్ క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సకు ఇచ్చే ఔషధాలు.. వ్యాధికి మూల కారణమైన భాగానికి చేరవేసే ప్రక్రియలో ఈ పొర అడ్డంకులను కలిగిస్తున్నదని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఎంఆర్ఐ ఆధారంగా ఆల్ట్రాసౌండ్ సాంకేతికతతో దీనికి చెక్‌పెట్టారు. ‘ట్రాస్టుజుమాబ్’ అనే యాంటీబాడీ థెరపీ డ్రగ్‌ను ఆల్ట్రాసౌండ్‌తో కణతి ఉన్న భాగానికి సరాసరిగా చేర్చడంలో విజయవంతమయ్యారు.