Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మధ్య విబేధాలున్నాయా..? బీజేపీ మాత్రం ఇది నిజమే అని ప్రచారం చేస్తోంది. ప్రియాంకా, రాహుల్ మధ్య అంతర్గత విబేధాలు చోటు చేసుకున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మధ్య విబేధాలున్నాయా..? బీజేపీ మాత్రం ఇది నిజమే అని ప్రచారం చేస్తోంది. ప్రియాంకా, రాహుల్ మధ్య అంతర్గత విబేధాలు చోటు చేసుకున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఈ అంశంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఇటీవల ప్రియాంకా గాంధీ తనయుడు, రాహుల్ గాంధీ మేనల్లుడు రైహాన్ వాద్రా విజువల్ అర్టిస్ట్, ఫొటోగ్రాఫర్ అనే సంగతి తెలిసిందే.
అతడి చిత్రాలతో ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్రదర్శనలో ఉంచిన 105 చిత్రాలలో 74 ఫోటోలను ఎగ్జిబిషన్ నిర్వాహకులు తొలగించారు. వాటిలో యువత నిరసనలు, రాజకీయ అంశాలకు సంబంధించినవి ఉన్నాయని, అందువల్లే వాటిని తొలగించామని నిర్వాహకులు వివరణ ఇచ్చారు. దీనిపై రైహాన్ తల్లి ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇది అప్రకటిత సెన్సార్షిప్ అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ వివాదం రాజకీయ అంశంగా మారింది. ఇంత వివాదం జరిగినా ఈ అంశంపై రాహుల్ గాంధీ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు.
ఈ ఘటనను ఖండించలేదు. సోదరి కుమారుడికి జరిగిన అవమానంపై రాహుల్ స్పందించకపోవడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రాహుల్, ప్రియాంకా మధ్య విబేధాలున్నాయని ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనలో ఉన్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. అందువల్లే ఆయన స్పందించలేదని కాంగ్రెస్ చెబుతోంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై నమ్మకం లేని ప్రియాంకా గాంధీ.. తన కొడుకును సాఫ్ట్ లాంచ్ చేయాలనుకున్నారని కూడా బీజేపీ విమర్శిస్తోంది. కానీ, ఈ వాదనను కాంగ్రెస్ ఖండిస్తోంది. గత వారం రాహుల్, ప్రియాంకా కలిసి నిరసనల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

