టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో SSMB 29 మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం. మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
అయితే మహేశ్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత SSMB 29 మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు, నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట.
తర్వాతి షెడ్యూల్ విదేశాలలో ఉంటుందట. ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్రబృందం చెబుతున్నది. అనవాయితీ ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్‌మీట్‌ను కూడా రాజమౌళి పెట్టనున్నారట. వెయ్యికోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.