కన్నుగీటిన సీన్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ ఒక్క సీన్ ప్రియా ప్రకాశ్ వారియర్ 9Priya Prakash Varrier) కు మంచి పాపులారిటీ తెచ్చి పెట్టింది. నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌ను షేర్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంటుంది. ఈ భామ తాజాగా వెకేషన్ టూర్లో బిజీగా ఉంది.
ప్రియా వారియర్ ఐలాండ్ తీరంలో సరదాగా షికార్లు చేస్తుంది.సాగర తీరం అందాలు ఆస్వాదిస్తూ..బోటింగ్ చేస్తూ..బీచ్‌లో తిరుగుతూ దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఈ భామ ఏ టూరిజం స్పాట్‌కు వెళ్లిందనేది తెలియాల్సి ఉంది.
గతేడాది నితిన్‌తో కలిసి చెక్ సినిమాలో మెరిసింది ప్రియా వారియర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. 2023 వరకు చేతినిండా ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ పెట్టుకుంది ప్రియా వారియర్.
ప్రియావారియర్ హిందీలో నటిస్తున్న శ్రీదేవి బంగ్లా, 3 మంకీస్, లవ్ హ్యాకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మలయాళ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ప్రియా వారియర్ స్టిల్స్‌పై ఓ లుక్కేయండి మరీ..