న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లలోనూ ప్రవేశించాయి. దీంతో ప్రధాన క్రిప్టోకరెన్సీ… బిట్‌కాయిన్ శనివారం ఉదయం ఒక్క గంటలోనే 10,000 డాలర్ల మేర పడిపోయింది. అంతర్జాతీయ క్రిప్టో ఎక్సేంజీల్లో బిట్ కాయిన్ ధర ఒక్కసారిగా 52,000 డాలర్ల నుంచి 42,000 డాలర్ల వరకు దిగింది. తదుపరి నష్టాల నుంచి కొంతవరకూ కోలుకుని 47,000 డాలర్ల సమీపంలో కదులుతున్నది. రెండో పెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఇథిరియం సైతం 15 శాతం క్రాష్ అయ్యింది. ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బలపడటం.. క్రిప్టో తాజా పతనానికి మరో కారణం.