హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ వారి ఇండియన్ సొసైటీస్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్ ఎస్కే వాసల్ అవార్డ్ ఫర్ ఎఫిషియెంట్ యూస్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ సోర్సెస్’ కు తెలంగాణలో పనిచేస్తున్న నలుగురు శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు.
రాజేంద్రనగర్లోని ఐకార్ -ఎన్బీపీజీఆర్ ప్రాంతీయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ శివరాజ్, డాక్టర్ సోమేశ్వరరావు పండ్రవడ, డాక్టర్ కమల, కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ పిడిగం సైదయ్యకు అవార్డు వరించింది. న్యూఢిల్లీల నిర్వహించిన కార్యక్రమంలో ఈ నలుగురు అవార్డు అందుకొన్నారు.