సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం బహదూర్పల్లిలోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో విక్రయించనున్న హెచ్ఎండీఏ ప్లాట్లకు బుధవారం ఉదయం 11గంటలకు మేకల వెంకటేశ్ పంక్షన్ హాలులో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. బహదూర్పల్లిలోని 40ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్లోని 101 ప్లాట్లను మార్చి మూడవ వారంలో ఈ వేలం ద్వారా విక్రయించనున్నారు.
రంగారెడ్డి జిల్లా తొర్రూర్లో 117ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. అందులోని 223 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీ బిడ్ సమావేశం 25న తొర్రూర్ సైట్లోనే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.