పాక్ చెర నుంచి హైదరాబాద్ యువకుడి విడుదల
పాక్ చెర నుంచి హైదరాబాద్ యువకుడి విడుదల | ప్రియురాలి కోసం వెళ్తూ పాక్‌లో పట్టుబడి నాలుగేళ్ల జైలు జీవితం గడిపిన యువకుడు ఎట్టకేలకు విడుదలయ్యాడు.

హైదరాబాద్ : ప్రియురాలి కోసం వెళ్తూ పాక్‌లో పట్టుబడి నాలుగేళ్ల జైలు జీవితం గడిపిన యువకుడు ఎట్టకేలకు విడుదలయ్యాడు. సోమవారం వాఘా సరిహద్దుల్లో భద్రతా దళాలకు యుకుడిని పాక్ రేంజర్స్ అప్పగించారు. ఇవాళ, సాయంత్రం, లేదంటే రేపు హైదరాబాద్ చేరుకోనున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రశాంత్ 2017లో అదృశ్యమయ్యాడు. తన ప్రియురాలి కోసం పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో అనుకోకుండా పాక్ భూభాగంలోకి వెళ్లాడు. దీంతో అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
ప్రశాంత్‌ను పాక్ అరెస్టు చేసినట్లు అతన్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ కోరింది. సరైన ధ్రువీకరణపత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. 2019లో తన కొడుకును రప్పించే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కోరారు. ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి విడుదల కోసం చొరవ చూపారు. సుమారు నాలుగేళ్ల తర్వాత తమ కొడుకు ఇంటికి చేరనుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడుదల కోసం కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 9 వరకు యాదాద్రిలో దర్శనాల నిలిపివేత
ఈ- మెయిల్ హ్యాక్ చేసి.. స్నేహితుడిగా నమ్మించి
12-15 ఏళ్ల వారికి ‘ఫైజర్’ టీకాకు జపాన్ ఓకే..
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న నవోమి ఒసాకా
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత
భారత ప్రయాణికులపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 1.27లక్షల కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

