‘హనుమాన్’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు ప్రశాంత్‌వర్మ. తాజాగా ఆయన భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో ‘అధీర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్నాడు. ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సోమవారం ఎస్జే సూర్య ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ‘సూపర్ హీరో చిత్రమిది.
ఆశ, అంధకారం మధ్య జరిగే యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి సూపర్‌హీరో ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. స్టన్నింగ్ విజువల్స్, గ్రాఫిక్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త వీక్షణానుభూతినందిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, క్రియేటెడ్ బై: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.