Pradeep Ranganathan | లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు కోలీవుడ్ యంగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు తెలుగులో ఎంట్రీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. లవ్ టుడే మూవీ అందించిన సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులు డ్యూడ్ (Dude), లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) . లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల తేదీని మేకర్స్ అక్టోబర్ 17న ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. కాగా డ్యూడ్ సినిమా తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇదే డేట్‌ను ప్రకటించారు. తాజాగా డ్యూడ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడంతో చాలా మంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరో తేదీన వస్తుందేమోనని చర్చించుకుంటున్నారు.
మరి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కోసం మేకర్స్ మరో తేదీని ఏమైనా సెలెక్ట్ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీని విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉప్పెన ఫేం కృతి శెట్టి ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌తో రొమాన్స్ చేయనుంది.
ఇక డ్యూడ్ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. రెండు సినిమాల తేదీలు ఒకటే కావడంతో మరి ఈ రెండింటిలో ఏ సినిమా అనుకున్న టైంకు విడుదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Anaconda Trailer | 21 ఏండ్ల తర్వాత రాబోతున్న అనకొండ.. ట్రైలర్ చూశారా!