హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : నిర్మాణ రంగంలో పరిశోధనలకుగాను ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఆర్ ప్రదీప్‌కుమార్ ఔట్‌స్టాండింగ్ కాంక్రీట్ ఇంజినీర్ -2021 అవార్డు అందుకున్నారు. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు అవార్డును ఆయనకు అందజేశారు. ప్రదీప్‌కుమార్ భూకంప ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంటర్ హెచ్వోడీగా పనిచేస్తున్నారు.