Asian Games : ఆసియా క్రీడల ఏడో రోజు భారత బృందం అదరగొట్టింది. కబడ్డీలో రెండు స్వర్ణాలు, షాట్‌పుట్‌లో తజిందర్ సింగ్ రజతం పట్టేయగా.. మహిళల 400 మీటర్ల పరుగులోలో ప్రచీ చౌదరీ (Prachi Choudhary) కాంస్యంతో గర్జించింది. ఆసియాడ్‌లో ఆమెకు ఇదే మొదటి పతకం కాగా బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు(PV Sindhu) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొమొక మియజాకి(జపాన్)తో జరిగిన ప్రీ-క్వార్టర్స్‌లో చెలరేగిన తెలుగు తేజం అలవోకగా ముందంజ వేసింది.
నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పీవీ సింధు సత్తా చాటుతోంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు మహిళల ప్రీ -క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ తొమొక మియజాకిను చిత్తు చేసింది. వరస సెట్లలో జోరు చూపించిన ఒలింపిక్ విజేత.. 21-9, 21-13తో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.
SINDHU MARCHES ON! 🏸⚡
PV Sindhu powers past Chinese Taipei’s Chiu Pin-chian in straight games (21-14, 21-14) to seal her spot in the Asian Games Round of 16! 🔥
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/WRYgMLCgBH
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2026
అంతకుముందు.. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రచీ చౌదరీ కంచు మోత మోగించింది. ఆసియా క్రీడల్లో ఆమెకిది మొట్టమొదటి మెడల్ కావడం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో ప్రచీ 53.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా తన కలల పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక మహిళల 1,500 మీటర్ల పరుగులో అంచనాలు అందుకుంటూ పరుల్ చౌదరీ ఫైనల్‌కు అర్హత సాధించింది.