Prabhas-Maruthi Movie Story | ప్రభాస్, మారుతి కాంబినేషన్లో సినిమా గురించి గత కొన్ని నెలలుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో కృష్ణంరాజు భార్య వీళ్ళ కాంబోలో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అప్పటినుండి సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా? అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ‘పక్కా కమర్షియల్’ ఫలితం తర్వాత మారుతితో ప్రభాస్ సినిమా చేస్తాడా? లేదా? అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకుల మదిలో మెదలుతూ వచ్చాయి. కాగా ఈ ప్రశ్నలన్నిటికి దాదాపు పులిస్టాప్ పడ్డట్లే. మారుతి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశాడట. ఏ క్షణమైనా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందట. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ప్రభాస్‌తో మారుతి చేయబోయే సినిమా తాత-మనవళ్ల కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇది ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ స్టోరీ కాకపోయినా, మారుతి రేంజ్లో మెప్పించే సినిమా అని టాక్. అంతేకాకుండా మారుతి, ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌ను కొత్తగా డిజైన్ చేశాడని సమాచారం. ఫ్యాన్స్ రేంజ్ ఎలివేషన్లు, ప్రేక్షకులకు కావలిసిన కామెడీ సీన్లు ఇలా అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఈ సినిమా మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవళ్ల కథతో సాగుతుందట. ఇదే కథకి హార్రర్ కమెడీ టచ్ అప్ ఇచ్చి మారుతి తన శైలిలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తుంది. కేవలం ఈ సెట్ కోసమే మేకర్స్ 6కోట్లు ఖర్చు చేశారట. ఇక మారుతి ఈ సినిమాను రెండు షెడ్యూల్స్‌లోనే పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్ని కుదిరితే నవంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే ఛాన్స్ ఉందట.