Animal Movie | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఎ.డి’ వంటి భారీ చిత్రాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కూడా ఆయన అప్‌కమింగ్ లిస్టులో వుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. పోలీస్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు.
కాగ ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. గురువారం రణ్‌బీర్ పుట్టిన రోజు సందర్భంగా బయటికి వచ్చిన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. తాజాగా ప్రభాస్ యానిమల్ టీజర్ పై తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ”స్టన్నింగ్ టీజర్… రణ్‌బీర్, సందీప్, భూషణ్ జీకి అభినందనలు. యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని పోస్ట్ చేశారు ప్రభాస్. యానిమల్ చిత్రం డిసెంబర్ 1న వస్తుండగా, సలార్ డిసెంబర్ 22 ప్రేక్షకులు ముందుకు వస్తోంది.