హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో కలిసి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సరికొత్తగా పేటీఎం ట్రాన్సిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఎన్సీఎంసీ కార్డు కొనుగోలు చేసి ప్రయాణ సమయంలో ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ వద్ద వాటిని చూపిస్తే సరిపోతుందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సజల్ భట్నాగర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ ఆశయమైన వన్ నేషన్, వన్ కార్డ్ ఆశయ సాధనకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. ఎల్ అండ్ టీ మెట్రోరైలు ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది రహిత ప్రయాణాల కోసం ఓపెన్ లూప్ స్మార్ట్ కార్డు ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు.