హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్వోహ్రా ఆదేశించారు. పనుల పురోగతిని బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీ జలవనరులశాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్‌నాటికి వర్షాలు తగ్గుముఖం పడుతాయని, ఆలోగా పూర్తి చేయాలని అన్నారు.