సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన ‘వన్-నేనొక్కడినే’ సినిమా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, చక్కటి మేకింగ్‌తో విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయినా.. మహేష్‌బాబు కెరీర్లో ఓ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు-సుకుమార్ కాంబినేషన్ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు మహేశ్‌బాబు.
దీని తర్వాత ఆయన కొంత విరామం తీసుకోబోతున్నారు. ఈలోగా సుకుమార్-రామ్‌చరణ్ సినిమా పూర్తవ్వాలి. దీని తర్వాతే సుకుమార్-మహేష్‌బాబు సినిమాపై స్పష్టత వస్తుందంటున్నారు. ప్రస్తుతానికైతే మహేష్‌బాబు ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి కాంబినేషన్ మూవీ తప్పకుండా ఉంటుదని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.