పవర్ లిఫ్టింగ్.. పేరుకు తగ్గట్టు పవర్ఫుల్గేమ్. మెండైన శారీరక ధారుడ్యంతో బరువులు ఎత్తడమే లక్ష్యం. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే
భారత్‌లో ప్రాచుర్యం పొందుతున్న పవర్ లిఫ్టింగ్ వైపు పురుషులతో పాటు మహిళలు ఆకర్షితులవుతున్నారు. సాధించాలన్న పట్టుదలకు కసి తోడైతే కొండలనైనా పిండిచేయగలమని మహిళామణులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి మన హైదరాబాద్ యువ లిఫ్టర్ వైష్ణవి మహేశ్ వస్తుందని చెప్పాలి. ఆటను అమితంగా ప్రేమిస్తూ పవర్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తున్నది.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకం కొల్లగొడుతున్న వైష్ణవి సత్తాచాటడమే తన లక్ష్యమంటున్నది. ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీకి ఎంపికైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
సరిగ్గా రెండేండ్ల క్రితం పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్నాను. రాజస్థాన్ వేదికగా జనవరిలో జరిగిన నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాను. ప్రత్యర్థి లిఫ్టర్లకు దీటైన పోటీనిస్తూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాను. దీని ద్వారా వచ్చే నెలలో కొయంబత్తూర్‌లో జరిగే ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నాను. ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి లిఫ్టర్లు బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా చైనా, జపాన్, కజకిస్థాన్ దేశాల లిఫ్టర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. అయితే ఏనాటికైనా ఆసియా, ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మెగాటోర్నీల్లో భారత్ తరఫున పతకం సాధించాలని ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నాను. అందుకు తగ్గట్లు ముందుకు సాగుతున్నాను.
వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాను. కోచ్ కౌశిక్ శిక్షణలో లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను. భారీ బరువులు ఎత్తాల్సిన క్రీడ కాబట్టి అందుకు తగ్గట్లు డైట్ ఫాలో అవుతున్నాను. కోచ్ సూచనలకు అనుగుణంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాను. కుటుంబ సభ్యులతో పాటు కాలేజీ యాజమాన్యం సహకారంతో టోర్నీల్లో పోటీపడుతూ పతకాలు సాధిస్తున్నాను. భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాను.
జీవితంలో ఏదైనా సాధించాలన్న కసితో పవర్‌గేమ్ అయిన లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. ఈ రెండేండ్ల కాలంలో కరోనా వైరస్‌తో పలు టోర్నీలు రద్దు కావడం, వాయిదా పడటంతో ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పడినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కరోనా విజృంభణ ముగిసిన నేపథ్యంలో ఈ ఏడాది వరుస టోర్నీలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధమవుతున్నాను. పవర్ లిఫ్టింగ్‌లో మూడు విభాగాలు ఉంటాయి. స్కాట్, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. స్వాట్‌లో 180 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 150 కిలోల వరకు బరువులు ఎత్తగలుగుతున్నాను. ఇది మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో బరువులపై దృష్టి సారించాల్సి ఉంది.
మిగతా క్రీడలతో పోల్చుకుంటే పవర్‌లిఫ్టింగ్ ఒకింత ఖర్చుతో కూడుకున్నది. ఇందులో శారీరక ధారుడ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. టోర్నీలు ఉన్న రోజుల్లో ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు డైట్ చాలా ముఖ్యమైంది. ఇది ఒక రకంగా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాము ఆర్థిక భారాన్ని భరించలేని స్థితిలో ఉన్నాం. ఎవరైనా స్పాన్సర్లు గానీ, ఆర్థికంగా ఎవరైనా అండగా నిలిస్తే సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక సాయం చేయదల్చుకున్న వాళ్లు ఈ నంబర్(9293507255)లో సంప్రదించవచ్చు.
సత్తా చాటడమే లక్ష్యం..
పవర్‌లిఫ్టర్ వైష్ణవి మహేశ్.. ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీకి ఎంపిక
పవర్ లిఫ్టింగ్.. పేరుకు తగ్గట్టు పవర్ఫుల్గేమ్. మెండైన శారీరక ధారుడ్యంతో బరువులు ఎత్తడమే లక్ష్యం. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే
భారత్‌లో ప్రాచుర్యం పొందుతున్న పవర్ లిఫ్టింగ్ వైపు పురుషులతో పాటు మహిళలు ఆకర్షితులవుతున్నారు. సాధించాలన్న పట్టుదలకు కసి తోడైతే కొండలనైనా పిండిచేయగలమని మహిళామణులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి మన హైదరాబాద్ యువ లిఫ్టర్ వైష్ణవి మహేశ్ వస్తుందని చెప్పాలి. ఆటను అమితంగా ప్రేమిస్తూ పవర్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తున్నది.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకం కొల్లగొడుతున్న వైష్ణవి సత్తాచాటడమే తన లక్ష్యమంటున్నది. ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీకి ఎంపికైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఏకైక లక్ష్యమేంటి?
సరిగ్గా రెండేండ్ల క్రితం పవర్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. ఒక్కో మెట్టు ఎదుగుతూ జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటుతున్నాను. రాజస్థాన్ వేదికగా జనవరిలో జరిగిన నేషనల్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాను. ప్రత్యర్థి లిఫ్టర్లకు దీటైన పోటీనిస్తూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాను. దీని ద్వారా వచ్చే నెలలో కొయంబత్తూర్‌లో జరిగే ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నాను. ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి లిఫ్టర్లు బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా చైనా, జపాన్, కజకిస్థాన్ దేశాల లిఫ్టర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. అయితే ఏనాటికైనా ఆసియా, ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మెగాటోర్నీల్లో భారత్ తరఫున పతకం సాధించాలని ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నాను. అందుకు తగ్గట్లు ముందుకు సాగుతున్నాను.
ఏషియన్ టోర్నీకి సన్నద్ధత ఎలా ఉంది?
వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాను. కోచ్ కౌశిక్ శిక్షణలో లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను. భారీ బరువులు ఎత్తాల్సిన క్రీడ కాబట్టి అందుకు తగ్గట్లు డైట్ ఫాలో అవుతున్నాను. కోచ్ సూచనలకు అనుగుణంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాను. కుటుంబ సభ్యులతో పాటు కాలేజీ యాజమాన్యం సహకారంతో టోర్నీల్లో పోటీపడుతూ పతకాలు సాధిస్తున్నాను. భవిష్యత్‌లోనూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాను.
చదువుతో పాటు కెరీర్‌ను ఎలా కొనసాగిస్తున్నారు?
జీవితంలో ఏదైనా సాధించాలన్న కసితో పవర్‌గేమ్ అయిన లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. ఈ రెండేండ్ల కాలంలో కరోనా వైరస్‌తో పలు టోర్నీలు రద్దు కావడం, వాయిదా పడటంతో ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పడినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కరోనా విజృంభణ ముగిసిన నేపథ్యంలో ఈ ఏడాది వరుస టోర్నీలు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్లు సన్నద్ధమవుతున్నాను. పవర్ లిఫ్టింగ్‌లో మూడు విభాగాలు ఉంటాయి. స్కాట్, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. స్వాట్‌లో 180 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 150 కిలోల వరకు బరువులు ఎత్తగలుగుతున్నాను. ఇది మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో బరువులపై దృష్టి సారించాల్సి ఉంది.
కెరీర్‌కు మద్దతు దొరుకుతుందా?
మిగతా క్రీడలతో పోల్చుకుంటే పవర్‌లిఫ్టింగ్ ఒకింత ఖర్చుతో కూడుకున్నది. ఇందులో శారీరక ధారుడ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. టోర్నీలు ఉన్న రోజుల్లో ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు డైట్ చాలా ముఖ్యమైంది. ఇది ఒక రకంగా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాము ఆర్థిక భారాన్ని భరించలేని స్థితిలో ఉన్నాం. ఎవరైనా స్పాన్సర్లు గానీ, ఆర్థికంగా ఎవరైనా అండగా నిలిస్తే సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక సాయం చేయదల్చుకున్న వాళ్లు ఈ నంబర్(9293507255)లో సంప్రదించవచ్చు.
వైష్ణవి సాధించిన పతకాలు:
రాష్ట్ర స్థాయి టోర్నీల్లో పలు స్వర్ణ పతకాలు
జాతీయ సబ్‌జూనియర్/జూనియర్ పవర్ లిఫ్టింగ్ టోర్నీ(ఉత్తరప్రదేశ్)లో 9వ స్థానం
జాతీయ సబ్‌జూనియర్ టోర్నీ(రాజస్థాన్)లో కాంస్య పతకం
నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ (కేరళ)లో స్వర్ణ పతకం