బహిష్టు వాయిదా మంచిదేనా?
గర్భాన్ని నిర్ధారించుకోవడానికి ఒకటే మార్గం.. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి బ్లడ్ టెస్టులోనే.. హెచ్‌సీజీ (హ్యూమన్ క్రానిక్ గోనడోట్రోపిన్) టెస్ట్ అని చేస్తారు. ఆ పరీక్షలో పాజిటివ్ వస్తే గర్భిణి అని అర్థం. అలా కాకుండా నెగెటివ్ వస్తే ఏవో కారణాల వల్ల నెలసరి ఆగిందని అనుకోవచ్చు
నా వయసు పాతిక. నెలసరిరాక నెలన్నర దాటింది. గర్భం ధరించానని అనుమానం. మరో పది రోజుల్లో అన్నయ్య పెండ్లి. ఆ సమయంలో నెలసరి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ ఇబ్బంది లేకుండా.. బహిష్టు వాయిదా వేసే మాత్రలు వాడవచ్చా? సాధారణంగా నాకు నెలలోపు ఎప్పుడూ పీరియడ్స్ రాలేదు. ఇప్పుడేం చేయాలి?
– ఓ పాఠకురాలు
గర్భాన్ని నిర్ధారించుకోవడానికి ఒకటే మార్గం.. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి బ్లడ్ టెస్టులోనే.. హెచ్‌సీజీ (హ్యూమన్ క్రానిక్ గోనడోట్రోపిన్) టెస్ట్ అని చేస్తారు. ఆ పరీక్షలో పాజిటివ్ వస్తే గర్భిణి అని అర్థం. అలా కాకుండా నెగెటివ్ వస్తే ఏవో కారణాల వల్ల నెలసరి ఆగిందని అనుకోవచ్చు. నెగెటివ్ వస్తే గర్భిణి కాదు కాబట్టి, నెలసరిని వాయిదా వేసే మందులు వాడవచ్చు. అసలు పీరియడ్స్‌ను వాయిదా వేయడం అవసరమా? మీరే ఆలోచించుకోండి.
అనవసరమైన వాటికి హార్మోన్ మాత్రలు వాడకూడదు. దీనివల్ల కాళ్లలో నెత్తురు గూడు కడుతుంది. దీన్ని వైద్యశాస్త్రంలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌గా పిలుస్తారు. గూడు కట్టిన నెత్తురు విచ్ఛిన్నమైనప్పుడు రక్త నాళాల గుండా గుండెకు, మెదడుకు ప్రయాణిస్తుంది. ఇలా జరిగితే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి గర్భిణి అయినా కాకపోయినా, నెలసరిని అడ్డుకునే మాత్రలు వాడకపోవడమే ఉత్తమం.
(వైద్య నిపుణుల సలహా కోసం మహిళా పాఠకులు తమ సమస్యల్ని zindagi@ntnews.com కు మెయిల్ చేయవచ్చు)
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

