Anchor Swetcha Votarkar Case | న్యూస్ ఛానల్ యాంకర్ ఆత్మహత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన కూతురి చావుకి పూర్ణ చందర్ కారణం అంటూ యాంకర్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ తర్వాత పూర్ణ చందర్ లేఖ విడుదల చేయగా, ఇందులో యాంకర్ ఆమె తల్లిదండ్రుల వలన మానసిక ఆవేదన చెంది సూసైడ్ చేసుకుందని ఉంది. ఇక మధ్యలో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ కూతురు తన పట్ల పూర్ణ చందర్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదు చేసింది. దాంతో పోక్సో కేసు పెట్టి పూర్ణ చందర్‌ని అరెస్ట్ చేశారు. అయితే పూర్ణ చందర్ మాత్రం తన లేఖలో ఆ యాంకర్ కుమార్తెను తన కన్న కూతురిలా చూసుకున్నానని..స్కూల్లో చేర్పించి ఫీజులు కడుతున్నానని పేర్కొన్నాడు.
ఆమె కూతురు ఫంక్షన్ కోసం తాను ఐదు లక్షలు ఖర్చు పెట్టానని కూడా అన్నాడు.. కానీ ఆ అమ్మాయి వర్షెన్ మాత్రం భిన్నంగా ఉంది. పూర్ణచందర్ ప్రవర్తన ఏ మాత్రం బాగా ఉండేది కాదని మీడియాకు చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. పూర్ణ చందర్ ద్వారానే ఆ న్యూస్ యాంకర్ తనకు పరిచయం అయిందని, ముందు వారిద్దరి మధ్య సంబంధం గురించి తనకు తెలియదని, ఎప్పుడైతే వారి వ్యవహారం తెలిసిందో అప్పుడే పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు. అయితే పూర్ణచందర్‌పై యాంకర్ కూతురు చేస్తున్న ఆరోపణలు పూర్తి అసత్యమని, అమెను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న స్పష్టం చేసింది.
న్యూస్ యాంకర్ నన్ను మానసికంగా ఎంతో టార్చర్ చేసిందని, పూర్ణచందర్‌ను బ్లాక్మెయిల్ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న స్పష్టం చేసింది. నా భర్త పూర్ణచందర్ నిర్దోషి, అమాయకుడంటూ స్వప్న కామెంట్ చేయడం గమనర్హం. అయితే ఆ న్యూస్ యాంకర్ చనిపోయే ముందు ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. దాంతో పూర్ణచందర్ ను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. కానీ అనూహ్యంగా యాంకర్ కుమార్తె తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. కుమార్తె ఫిర్యాదుతో పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు పూర్ణ చందర్. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పరిశీలనలో అనుమానాస్పద అంశాలు ఏమైనా బయటపడితే.. అవి సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి.