ధర్మ, పవి జంటగా శ్రీ లక్ష్మీనరసింహా మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రవీణ్‌రెడ్డి నిర్మాత. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్‌నివ్వగా, మాగంటి గోపీనాథ్ కెమెరా స్విఛాన్ చేశారు. శ్రీవిష్ణు, వీఎన్ ఆదిత్య చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందించారు. నిర్మాత మాట్లాడుతూ ‘పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన శ్యామ్ వినూత్నమైన పాయింట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మక కథాంశంతో ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తిస్తుంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, సినిమాటోగ్రఫీ: కేశవ.