హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం (Inavolu Mallanna Temple) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లికార్జునస్వామి బ్రహోత్సవాత్సల్లో చివరి ఆదివారం, పెద్దపట్నం కార్యక్రమం ఉండడంతో స్వామి వారి దర్శినానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఐనవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతరలో బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తులో అనుభవం లేని పోలీసులను బందోబస్తుకు తీసుకరావడం సమస్యగా మారింది. పెద్ద పట్నం చూడటానికి వచ్చిన భక్తులతో, న్యూస్ కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆ మర్యాదగా మాట్లాడారు.
పోలీసుల ప్రవర్తనతో ఆటు భక్తులు, ఇటు రిపోర్టర్లు చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శానానికి వచ్చే ఏ వీఐపీ అయినా, వీవీఐపీ, డోనర్లు, వివిధ శాఖాలకు చెందిన ఉద్యోగులైనా ప్రత్యేక దర్శనం కోసం రావాలంటే స్థానిక ఎస్ఐ అనుమతి తీసుకోని రావాలని హుకుం జారీ చేయడం చర్చినీయాంశంగా మారింది. ఇదే కాకుండా వీఐపీలను లోపలికి తీసుకవెళ్లే ద్వారానికి తాళం వేసి పోలీసు దగ్గర పెట్టుకొని, ఒక్క పోలీసు శాఖ అధికారులను మాత్రమే దర్శనానికి తీసుకవేళ్లాడం గమనార్హం మారింది. జాతరకు బందోబస్తు వేసే సిబ్బందిని ఇంత ముందు అవగాహన ఉన్న సిబ్బందిని బందోబస్తుకు తీసుకవస్తే బాగుండేదాని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.