మెహిదీపట్నం ఫిబ్రవరి 10 : ప్రజల శాంతి,భద్రతల కోసం నిరంతరం శ్రమించాలని,వారికి ఉత్తమ సేవలు అందించాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. గత మూడు నెలల కాలంలో గోల్కొండ, టోలీచౌకి, లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్తమ సేవలు అందించిన టోలీచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్‌కు నగర సీపీ ప్రశంసా పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ మాట్లాడుతూ.. ప్రజల శాంతి,భద్రతల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.