మరికల్, జనవరి 4: పంట మార్పిడి వ్యవసాయం చేస్తే ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సహకార, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన జాయింట్ నోడల్ అధికారి రమణకుమార్ రైతులకు సూచించారు. ఆదివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఆయన పర్యటించి మాట్లాడారు.
దేశంలోని 100 జిల్లాలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించి ఆరేండ్లలో రైతులకు విత్తనాలు, ఎరువులు, యంత్రాలు ఇస్తారని చెప్పారు. కాలానికి అనుగుణంగా తగిన వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు.