న్యూఢిల్లీ: ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 19వ విడత నిధులను ప్రధాని మోదీ సోమవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు జమ చేసినట్టు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ‘అన్నదాతలు దేశానికి గర్వకారణం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలన్న ఆశయానికి కట్టుబడి ఉన్నాం’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బీహార్‌లోని భాగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధులను విడుదల చేశారు.