మలక్‌పేట/సైదాబాద్/చాదర్‌ఘాట్, ఫిబ్రవరి 17 : మూసారాంబాగ్, పాత మలక్‌పేట డివిజన్లలో టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం అలుపెరుగని పోరాటంచేసి చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించిపెట్టిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మలక్‌పేట నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయం ఆవరణలోని బధిరుల పాఠశాల ముందు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి, బధిర విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ ఖన్నా, టీఆర్ఎస్ నాయకులు, బధిర విద్యార్థులు పాల్గొన్నారు.
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మూసారాంబాగ్ శ్రీపురం కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాజీ కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చన చేయించారు. అనంతరం దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మూసారాంబాగ్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్.రఘునందన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ధర్మెందర్, నాయకులు దేవదాసు, నాగరాజు, అభిషేకం, శశిధర్రావు, కాలనీ సంక్షేమసంఘ నాయకులు, ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సైదాబాద్, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మలక్‌పేట నియోజకవర్గంలో పండుగలా జరుపుకున్నారు. నియోజకవర్గ పరిధిలో కేక్‌లు కట్ చేయటంతోపాటు పేద ప్రజలకు పండ్లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సైదాబాద్ ధోబీఘాట్ చౌరస్తాలో ఐఎస్ సదన్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మన్నె శ్రీరంగ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సైదాబాద్ రెవెన్యూ బోర్డు కాలనీలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మలక్‌పేట నియోజకవర్గం ఇన్చార్జి అజం అలీ, డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి పాలొ కేక్‌కట్ చేశారు. అదేవిధంగా జీవన్‌జ్యోతి సంఘం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజం అలీ పాల్గొని కేక్ కట్ చేసి స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైబర్టెల్ బీఎన్ రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అజం అలీ హాజరై కేక్ కట్‌చేసి ఘనంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు ప్రతిఒక్కరూ సీఎం కేసీఆర్ పేరుతో మొక్కలు నాటుదాం అనే సంకల్పంతో ప్రజలకు మొక్కలను అందజేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లను ప్రారంభించిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మలక్‌పేట నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి ఆజం అలీ అన్నారు. గురవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఎంఆర్ఎస్ సైదాబాద్ బాలుర-1 స్కూల్లో ఘనంగా నిర్వహించారు.