
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన యపాన్ బయోలో పిరమల్ ఫార్మా రూ.101.77 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. దీంతో యపాన్లో పిరమల్ ఫార్మా 27.78 శాతం వాటాను కొనుగోలు చేసినట్టయింది. పిరమల్ ఫార్మా సొల్యూషన్స్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్(సీడీఎంఓ) వ్యాపారాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో పిరమల్ ఈ పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించింది.