మెల్బోర్న్: టెన్నిస్ దిగ్గజం సెరీనా అక్కడ.. స్టార్ ప్లేయర్ వీనస్ విలియమ్స్( Venus Williams) చరిత్ర సృష్టించనున్నది. 45 ఏళ్ల వయసులో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనున్నది. ఈ విషయాన్ని ఇవాళ కన్ఫర్మ్ చేశారు. ఆ వయసులో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆడుతున్న తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ డ్రాలో 45 ఏళ్ల వయసున్న ప్లేయర్లు ఎవరూ ఇప్పటి వరకు ఆడలేదు.
అయిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే ఛాన్సు వీనస్‌కు దక్కింది. వైల్డ్ కార్డు ఎంట్రీ కింద ఆమెకు ఆ అవకాశం కల్పించారు. 1998లో 17 ఏళ్ల వయసులో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడింది వీనస్. నాలుగోసారి ఆడినప్పుడు ఆమె క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో వీనస్ తన కంబ్యాక్ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడింది.
ఏడు గ్రాండ్ స్లామ్ టోర్నీలు గెలిచిన వీనస్.. ప్రస్తుతం 576 ర్యాంక్‌లో ఉన్నది. ఈ ఏడాది జరిగిన న్యూజిలాండ్, హోబర్ట్ వార్మప్ టోర్నీల్లో ఆమె ఓటమి పాలైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆదివారం ఆమె తొలి మ్యాచ్ ఆడనున్నది. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ గెలిచినా.. రెండో రౌండ్లో ఆమె మూడవ సీడ్ కోకా గాఫ్‌తో తలపడుతుంది.
Ready for Australian Open no.22 👇https://t.co/pf9Gq71lZz
— #AusOpen (@AustralianOpen) January 17, 2026