నార్నూర్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతంగా పరిష్కరించేందుకు పైలట్ ప్రజావాణి ( Pilot Prajavani ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్( DLPO Prabhaker) అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో పైలట్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ అర్జీలు రావడంతో వాటిని పరిశీలించి, సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాడీ రాజా లింగం, ఎంపీడీవో పుల్లారావు, సూపరింటెండెంట్ రాథోడ్ గంగా సింగ్, డిప్యూటీ తహసీల్దార్ శ్యాంసుందర్, ఈజీఎస్ ఏపీవో రాథోడ్ సురేందర్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.