మనిషికి పంది కిడ్నీ.. ప్రపంచంలోనే ఇది తొలిసారి

- బ్రెయిన్ డెడ్ మహిళకు శస్త్ర చికిత్స
- మూడు రోజుల పాటు పరిశీలన
- విజయవంతం.. పనితీరు సాధారణం
- అమెరికా వైద్యుల వినూత్న ప్రయోగం
న్యూయార్క్, అక్టోబర్ 20: మూత్రపిండాల మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు వినూత్న ప్రయోగం చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పంది మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు. ఇది సత్ఫలితాన్నిచ్చింది. మానవ మూత్రపిండం లాగే పనిచేసింది. మానవ రోగ నిరోధక వ్యవస్థ పంది కిడ్నీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనబర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. లక్షల మందికి కిడ్నీ మార్పిడి చికిత్స అవసరం. అయితే, అవసరమైనన్ని కిడ్నీలు లేక చికిత్సలు ఆలస్యం అవుతున్నాయి. ఫలితంగా చాలా మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ప్రయోగం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది.
న్యూయార్క్‌కు చెందిన వైద్యులు ఈ ప్రయోగంలో భాగంగా.. మానవ ఇమ్యూనిటీకి సహకరించేలా మొదట పంది జన్యువుల్లో కొంత మార్పులు చేశారు. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో పాటు బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు శస్త్ర చికిత్స చేసి పంది కిడ్నీని అమర్చారు. మూడు రోజుల పాటు పరిశీలించారు. మనిషి కిడ్నీ మాదిరే పంది మూత్రపిండం పనిచేసిందని శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన సర్జన్ మాంట్గోమరి చెప్పారు. జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడంపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజా ప్రయోగం ఈ పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చిందని వారు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- pig kidney
- Pintop1
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

