హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల తేదీలు ఖరారయ్యాయి. మే 31 నుంచి జూన్ 3 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్కిల్ టెస్ట్‌లు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో తేదీలను ఖరారు చేశారు. ఈ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న విడుదలకానున్నది. మార్చి 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుము లేకుండా మే 5 వరకు, ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కేంద్రం కొత్తగా వీబీజీ-రామ్‌జీ చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపాధిహామీ చట్టాన్ని కాపాడుకోవడానికి శనివారం నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.