హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఛాయాచిత్ర మహర్షిగా పేరుగాంచిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ మృతికి తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆదివారం ప్రగాఢ సంతాపం తెలిపింది.
రఘు మరణం ఛాయాచిత్ర రంగానికి తీరని లోటు అని, తన కెమెరా ద్వారా సమాజాన్ని ప్రతిబింబించారని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జీ భాస్కర్ అన్నారు. భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన రఘు రాయ్ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ చిన్న యాదగిరిగౌడ్ కొనియాడారు.