హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలకానుంది. మార్చి 17నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సోమవారం కూకట్పల్లిలోని జేఎన్టీయూలో నిర్వహించిన సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయా షెడ్యూల్ను పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ అరుణకుమారి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బీ రవీంద్రారెడ్డి విడుదల చేశారు. షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.