న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: సామాన్యుల నడ్డివిరుస్తూ పెట్రో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు బుధవారం నిర్ణయం తీసుకొన్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కి పెరగ్గా, డీజిల్ 105.49కి చేరింది. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలను పెంచిన కేంద్రం.. ఏకంగా 10 శాతం వరకు వడ్డించింది. మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ.11.29, డీజిల్‌పై రూ.10.87 పెరిగింది. మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో లీటర్ పెట్రోల్ దేశంలోనే అత్యధికంగా రూ.123.46 ఉండగా.. ఆంధ్రపదేశ్‌లోని చిత్తూరులో లీటర్ డీజిల్ అత్యధికంగా రూ.107.61గా ఉన్నది.
సీఎన్జీపై వాత
సహజవాయువు ధరలను చమురు కంపెనీలు పెంచడంతో ఢిల్లీ, ముంబై, గుజరాత్లో సీఎన్జీ ధరలు పెరిగాయి. రూ.2.5 తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.66.61కి చేరింది. ముంబైలో రూ.7 వడ్డింపుతో రూ.67కి, గుజరాత్లో రూ.6.5 పెంపుతో 76.98కి చేరుకొన్నది.