మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు | పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి.

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్‌కు 23 పైసలు, డీజిల్ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.44, డీజిల్ లీటర్ రూ.84.32కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది. పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, చెన్నైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ 87,16కు చేరాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.91.92కు చేరింది.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. మే నెలలో ఇప్పటి వరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.3.04, డీజిల్‌పై రూ.3.59 పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఓ వైపు కరోనాతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్, నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పనుల్లేక ఇబ్బందులు పడుతుండగా.. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల మరింత పెనుభారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

