చిక్కడపల్లి, నవంబర్ 17: పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని సీఐటీయూ జనరల్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. సీఐటీయూ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్నాయి. బుధవారం రాజ్యసభ సభ్యుడు ఎలమరం కరీం విలేకరు లతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని, కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు కావడంలేదని ధ్వజమెత్తారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజలకు అమూల్య సేవలందించిన ఆశ వర్కర్లకు కేవలం రూ.6 వేలే ఇస్తున్నారని, అన్ని రంగాల్లో కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం లో కొవిడ్‌కు ముందున్న ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతున్నదని, పరిస్థితులు మ రింత దిగజారేలా ఉన్నాయని ఆందోళన వ్య క్తం చేశారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లేదని మండిపడ్డారు. సమావేశం లో సీఐటీయూ జాతీయ నాయకుడు కరుమ లై, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, కార్యదర్శి ఎస్ రమ పాల్గొన్నారు.