పెసరపప్పు: పావు కిలో
బొంబాయి రవ్వ: 50 గ్రాములు
అల్లం: అంగుళం ముక్క
పెరుగు: ముప్పావు కప్పు
ఉప్పు: తగినంత
సోడా ఉప్పు: పావు స్పూను (లేదా) ఒక ఈనో పాకెట్
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాతి ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. అందులో బొంబాయి రవ్వ కలపాలి. తర్వాత పెరుగు కూడా వేసి కలియబెట్టాలి. అల్లం ముక్కను సన్నగా తురిమి ఈ మిశ్రమానికి కలపాలి. ఇప్పుడు ఉప్పుతోపాటు సోడా ఉప్పు కానీ ఈనోసాల్ట్ కానీ వేసి బాగా కలపాలి. తర్వాత ఇడ్లీ పాత్ర ప్లేట్లకు కాస్త నెయ్యి లేదా నూనె రాసి ఈ పిండిని వేసి, ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. కుక్కర్లోనూ నీళ్లు పోసి ఈ ప్లేట్లను పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. అయ్యాక తీసి, కొబ్బరి చట్నీతో వేడివేడిగా వడ్డిస్తే పెసర ఇడ్లీ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. లేత పచ్చ రంగులో ఉండే ఇది ఇడ్లీ వద్దనే పిల్లల్నీ రారమ్మంటూ ఊరించేస్తుంది.