HYD Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీచాయి. యూసుఫ్‌గూడ, మధురానగర్, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లిలో వర్షం పడింది. మలక్‌పేట, సైదాబాద్, సరూర్‌నగర్, సంతోష్‌నగర్, బహదూర్‌పురా, కిషన్‌బాగ్, పురానాపూల్, జూపార్క్, గుర్రంగూడతో పాటు లపు ప్రాంతాల్లో వర్షం వాన కురిసింది.
ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని ప్యాట్నీ, పారడైజ్, చిలుకలగూడ, మారేడ్‌పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, మల్లాపూర్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, నాగారం, రామంతాపూర్, ఉప్పల్, బోడుపల్ల, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతున్నది.
ఇదిలా ఉండగా.. దక్షిణ హైదరాబాద్‌లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. షేక్‌పేట, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, మెహదీపట్నం, రాజేంద్రనగర్, చార్మినార్, సైదాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణకేంద్రం పేర్కొంది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. నగరంలో గరిష్టంగా 33, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయువ్య దిశలో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది.