HomeNewsPeople Who Do Not Eat Chia Seeds May Face Skin Problems
చియా.. లిమిట్‌లోనే
చియా గింజలను ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది. అందులోనూ తక్కువ నీటిలో ఎక్కువ గింజలను కలిపి తీసుకుంటే.. మరిన్ని తిప్పలు తప్పవు మరి.
చియా గింజలను ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది. అందులోనూ తక్కువ నీటిలో ఎక్కువ గింజలను కలిపి తీసుకుంటే.. మరిన్ని తిప్పలు తప్పవు మరి.
చియా గింజలు పడనివారికి చర్మ సమస్యలు ఎదురుకావొచ్చు. పూర్తిగా నానబెట్టకుండా తీసుకుంటే.. గొంతునొప్పి పలకరించవచ్చు.
ఫైబర్ గనులు.. చియా గింజలు! ఈ ఫైబర్ పెరిగితే.. ఇతర పోషకాలపై ప్రభావం పడుతుంది. ఇతర ఆహార పదార్థాలలోని పోషకాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది.
రక్తపోటు తగ్గడానికి చియా గింజల్ని ఆశ్రయిస్తారు. కానీ, ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. లో బీపీ మిమ్మల్ని ఆశ్రయిస్తుంది.
చియా గింజలు రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. అయితే.. పరిమితికి మించి తీసుకుంటే ఆ నియంత్రణ అదుపు తప్పుతుంది. కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.
ఈ గింజల్ని అదే పనిగా తీసుకుంటే..శరీరంలో క్యాలరీలతోపాటు శరీర బరువూ పెరుగుతుంది.అందుకే, అతి ఎప్పటికీ మంచిది కాదు… కాబట్టి, చియా గింజలను అవసరమైనంత వరకే తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు.