టేక్మాల్: బీసీలకు ( BCs ) 42శాతం రిజర్వేషన్లు ( Reservations ) కల్పించాలని కోరుతూ శనివారం చేపట్టనున్న తెలంగాణ బంద్ ( Telangana Bandu ) కు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సహకరించాలని బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్( Bhasker ) పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సాధ్యం కాని జీవోలతో బీసీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి చిత్త శుద్ధిని చాటు కోవాలన్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోవడం, జీవో 9 ఆర్డినెన్సుపై రాష్ట్ర హైకోర్ట్ స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని బీసీ సంఘాలు 18న రాష్ట్ర బంద్ కు పిలుపును ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు.