హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టడంలో టీపీసీసీ నేత రేవంత్‌ను మించిన నా యకుడుండరేమో. ఓ పక్క దశాబ్దాల తరబడి పడావుపడ్డ భూముల్లోకి గోదావరి జలాలను పారించి.. ఎవుసాన్ని సుసంపన్నం చేసి రైతులను సంపన్నులుగా మార్చడానికి రాష్ట్ర ప్రభు త్వం పరితపిస్తుంటే.. వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకొంటున్నదంటూ తప్పుడు ఆరోపణలు చేసి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తున్నారు. 2014కు ముందు తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉన్నది? ఏడున్నరేండ్లలో ఎట్లా ఉన్నదో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. చెరువుల్లో నీళ్లు.. చేనుల్లో పంట తెలంగాణలో కనిపించని చోటున్నదా? గత రెండు సీజన్లలో భారత ఆహార సంస్థ ఎక్కువగా ధాన్యం కొన్న ది తెలంగాణ దగ్గర కాదా? కరోనా సమయం లో కూడా చివరిగింజ వరకూ కొన్నది దేశం లో తెలంగాణ ప్రభుత్వమే కదా.. వచ్చే యా సంగిలో వరి ధాన్యం కొనేది లేదని కేంద్రం తరఫున భారత ఆహార సంస్థ తెగేసి చెప్పింది. సీఎం సహా.. మంత్రులు ప్రధానికి, కేంద్ర మంత్రులకు నివేదించినా ధాన్యం కొనడానికి సుముఖత వ్యక్తం కాలేదు.
ఈ పరిస్థితుల్లో వరి పండించినా కొనేవాళ్లు లేక అన్నదాతలు అల్లాడిపోకుండా.. ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వమే సూచిస్తున్నది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరి విత్తనాలకు బదులుగా పప్పులు, ఆయిల్‌పామ్ వంటి ఇతర పంటల విత్తనాలు అమ్మాలని విత్తన డీలర్లను ఆదేశించారు. వెంటనే రేవంత్ అండ్ కో కలెక్టర్‌పైనా.. ప్రభుత్వంపైనా విరుచుకుపడటం ప్రారంభించారు. హాయిగా ఉన్న రైతు ల్లో అనుమానపు బీజాలు నాటాలని కుట్ర మొదలుపెట్టారు. వరి ధాన్యం ఎఫ్‌సీఐ కొనకపోతే.. పండించిన రైతు ఏమైపోవాలి? బాధ్య త మరచి ప్రవర్తిస్తున్నదెవరు? ఒక ఎంపీగా తనపై ఉన్న బాధ్యతను తప్పించుకొంటున్నదెవరు? రైతుల పట్ల బాధ్యత ఉన్నది కాబట్టే.. రైతు పండించిన పంట నష్టపోకూడదు కాబ ట్టే.. ఎంతో నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను సరైన దారిలో నడిపించాలని చూస్తున్న ది. వరిధాన్యాన్ని కొనేది లేదంటూ కచ్చితంగా చెప్తున్న కేంద్రాన్ని పార్లమెంటు సభ్యుడిగా నిగ్గదీసి అడగాల్సిన రేవంత్‌రెడ్డి మాత్రం తన బాధ్యత నుంచి తప్పించుకొంటూ.. మొసలికన్నీరు కారుస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాపాన్ని ముడిపెడుతున్నారు.