హైదరాబాద్, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 293.30 శాతం పెరిగి రూ.10.71 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గతేడాది ఇది రూ.2.73 కోట్లుగా ఉన్నది. ఆదాయం కూడా రూ.411.93 కోట్ల నుంచి రూ.532.97 కోట్లకు చేరుకున్నది. అలాగే ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలానికిగాను రూ.1,572. 98 కోట్ల ఆదాయంపై రూ.25.19 కోట్ల లాభాన్ని గడించింది.