నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 3 : పెండింగ్ కేసుల ను త్వరగా పరిష్కరిస్తామని జూనియర్ సివిల్ జడ్జీ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల న్యాయ సేవా సంస్థ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వ ర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును శనివారం హీరా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్‌కు సంబంధించి వాహనదారులకు అవగా హన కల్పించారు. ఇక నుంచి మద్యం తాగి వాహ నం నడిపితే రూ.1000 జరిమానా కాకుండా జైలు శిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, న్యాయవాదులు, వాహన డ్రైవర్లు తదితరు లు పాల్గొన్నారు.