దారి చూడు దుమ్ము చూడు మామా, యాడ పోయినాడో, భలేగుంది బాలా, రెడ్డమ్మ తల్లి పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి జోష్ నింపారు ప్రముఖ జానపద రచయిత, గాయకుడు పెంచల్దాస్. తన రచనా శైలి, గాత్రంతో (రాయలసీమ మాండలికం) ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నపెంచల్‌దాస్‌ను ఇవాళ సినీ నటుడు పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో సత్కరించారు.
పెంచల్‌దాస్‌ను శాలువాతో సత్కరించి, వినాయక ప్రతిమను అందజేశారు. రాయలసీమ జానపద, మాండలికాన్ని పెంచల్ దాస్ నేటి తరానికి అందించడం ప్రశంసనీయమని పవన్‌కల్యాణ్ ఈ సందర్బంగా అన్నారు. హారిక, హాసిని క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకుంది.
Shri. @PawanKalyan garu & Shri. #Trivikram garu honoured Rayalaseema folk writer & singer Penchal Das garu in Hyderabad. Pawan Kalyan garu said that it is commendable that Penchal Das garu is bringing the folklore & dialect of Rayalaseema closer to today's generation! pic.twitter.com/zHFbtnq4IS
— Haarika & Hassine Creations (@haarikahassine) March 9, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.