
న్యూఢిల్లీ, నవంబర్ 12: రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మాజీ చైర్మన్ పీసీ మోదీ నియమితులయ్యారు. మూడు నెలల కిందటే సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన పీపీకే రామాచార్యులను తప్పిస్తూ.. ఆ స్థానంలో పీసీ మోదీని నియమించారు. ఆయనకు క్యాబినెట్ కార్యదర్శి ర్యాంకు, హోదా కల్పించారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకున్నది.