కారేపల్లి, మార్చి 12 : కారేపల్లి మండల పరిధిలోని పాత కమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు బాబురావు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 10న ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు స్వగ్రామం పాత కమలాపురంలో గురువారం బాబురావు అంత్యక్రియలు నిర్వహించారు. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ తో పాటు, పలువురు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు హాజరై మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.